రేపు హైకోర్టు న్యాయమూర్తి రాక
26-09-2026 | 12:07pm
కరీంనగర్, సెప్టెంబర్26(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్(Venugopal) ఆదివారం కరీంనగర్, జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న “కరీంనగర్ మారథాన్” కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మారథాన్‌తో పాటు నగరంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లోనూ న్యాయమూర్తి పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.