13 March, 2026 | 5:40 AM

కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు జడ్జి వేణుగోపాల్

27-10-2024 11:31 AM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవవూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి బీవీ వేణుగోపాల్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయానికి వచ్చిన హైకోర్టు జడ్జి దంపతులను దేవాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.