23 July, 2026 | 3:34 AM

బడి వేళల్లోనే శిక్షణ!

23-07-2026 03:00 AM
  1. ప్రభుత్వ టీచర్లకు నైపుణ్య శిక్షణ
  2. బోధనకు ఆటంకం, నష్టపోతున్న విద్యార్థులు   
  3. ఒకరిద్దరు టీచర్లున్న చోట మరిన్ని ఇబ్బందులు  

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు విద్యాబోధనకు అడ్డంకిగా మారుతున్నాయి. సెలవు రోజుల్లో కాకుండా పని దినాలను ఎంచుకోవడంతో ప్రభుత్వ బడుల్లో బోధన గాడి తప్పుతోంది. ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల సిలబస్ వెనుకబడి విద్యార్థులు నష్టపోతున్నారు. ఉపాధ్యాయులకు నైపుణ్యవిద్య పేరుతో ఈనెల 2 నుంచి విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒక్కో విడతలో మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు.

ఈ సమయంలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులు ఉండటం లేదు. ముఖ్యంగా ఒకరిద్దరు టీచర్లు ఉన్న పాఠశాలల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. ఒకరు, ఇద్దరు ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 5వేల నుంచి 8వేల వరకు ఉన్నాయి.

ఆయా స్కూళ్లలో బోధన కుంటుపడుతోంది. వేసవిలో, సెలవు దినాల్లో కాకుండా పాఠశాలల సమయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌లో ఫీజు చెల్లించలేక తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపుతుంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఈనెల 31 వరకు శిక్షణ

క్వాలిటీ లెర్నింగ్, క్లాస్ రూమ్ ప్రాక్టీసింగ్‌లో భాగంగా ఈనెల 2నుంచి ఉపాధ్యా యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్‌లు, లాగ్వేజ్ పండిట్‌లు, హెచ్‌ఎంలకు పాఠశాల విద్యాశాఖ ఆయా అంశాలపై శిక్షణ ఇస్తుంది. ఒక్కో టీచర్‌కు మూడు రోజుల పాటు రాష్ట్ర, జిల్లా, మండల్ స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా టీచర్లు తరగతి గదులకు బదులు ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. శిక్షణ సమయంలో బడులను మూసివేయకుండా  అంగన్‌వాడీ టీచర్లకు బాధ్యతలు అ ప్పగిస్తున్నారని, మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు తీసుకుని, మధ్యాహ్న భోజనం పెట్టి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.  

పనివేళల్లో కాకుండా..

మెరుగైనా ఫలితాలు సాధించాలంటే ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచాలి. ఇం దుకు శిక్షణ కార్యక్రమాలు అవసరమేన ని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.  వీటిని సూళ్ల పనివేళల్లో కా కుండా, ఆన్‌లైన్‌లో లేదా ప్రత్యామ్నాయ స మయాల్లో ఇస్తే బోధనకు అంతరాయం ఉం డదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక ఉపాధ్యాయుడితో నడిచే పాఠశాలల్లో టీచర్ శిక్షణకు వెళ్తే విద్యార్థులకు బోధన పూర్తిగా నిలిచిపోతుంది.

రూ.లక్షలు వెచ్చింది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆ సమయంలో టీచర్ బడిలో అందుబాటులో లేకపోతే లక్ష్యం నెరవేరదని విద్యావేత్తలు పే ర్కొంటున్నారు. ఉపాధ్యాయులు శిక్షణకు హాజ రైన సమయంలో బోధనకు అటంకం కలగకుండా ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది.

ప్రైవేట్ స్కూళ్ల లో ఫీజులు భరించలేక ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రు లు.. పూర్తిస్తాయిలో ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని్ర పభావం అడ్మిషన్లపై పడి విద్యార్థులు ప్రభు త్వ బడుల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.