వెంకట రమణ గోవిందా!
అక్రమాస్తుల కేసులో ‘రెడ్కో’ డీఈ అరెస్టు
- పది ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు
- శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో రూ.1.23 కోట్ల విలువైన 4 ప్లాట్లు గుర్తింపు
- కూకట్‌పల్లి ఆంజనేయనగర్‌లో 1.82 కోట్ల వాణిజ్య భవనం
- భార్య పేరిట నాలుగు నిర్మాణ సంస్థలు, పలు చోట్ల 10 అపార్ట్‌మెంట్లు
- మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా 28.14 కోట్లు
- బహిరంగ మార్కెట్‌లో 100 కోట్లకు పైగానే!
రంగారెడ్డి/శేర్లింగంపల్లి, జూలై 22 (విజయక్రాంతి): ఆదాయానికి మించి ఆస్తులు గడించారనే ఆరోపణలతో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) డివిజనల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకట రమణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో 10 ప్రత్యేక బృందాలు ఉదయం 6 గంటల నుంచే హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు, సహచరులు, బినామీల ఇళ్లు మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో అధికారిక లెక్కల ప్రకారం 28.14 కోట్ల స్థిర, చరాస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టుల కేటాయింపులు, పరికరాల సరఫరా పనుల్లో వెంకటరమణ క్రమం తప్పకుండా పర్సంటేజీల రూపంలో కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఆస్తుల వివరాలు..
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో రూ.1,23, 46,000 విలువైన 4 ఫ్లాట్లు గుర్తించారు. కూకట్‌పల్లి ఆంజనేయ నగర్‌లో 160 గజా ల విస్తీర్ణంలో రూ.1.82 కోట్ల విలువైన జీ+3 వాణిజ్య భవనం, శేరిలింగంపల్లి గట్తల బేగంపేట్‌లో 250 చదరపు గజాల్లో రూ.2.90 కోట్ల విలువైన జీ+5 వాణిజ్య భవనం గుర్తించారు. భార్య పేరిట నాలుగు నిర్మాణ సంస్థ లను ఏర్పాటు చేసి, కూకట్‌పల్లి ఆంజనేయ నగర్, మూసాపేటలో 10 అపార్ట్మెంట్లను ని ర్మించారు.
వీటి అంచనా పెట్టుబడి రూ. 20 కోట్లు (వీటి బహిరంగ మార్కెట్ విలువ మ రింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది). వెంకటరమణ తన భార్య పేరుపై ‘ఎమ్మెస్ ప్రైడ్’ రియల్ ఎస్టేట్ సంస్థతో పాటు ఇతర నిర్మాణ కంపెనీల్లో భారీగా అక్రమ సొ మ్ము ను మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. పలు బ్యాంకుల్లో రూ.52.02 లక్షల నగదు, రూ.40 లక్షల విలువైన 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు.
రూ.45 లక్షల విలువైన కియా, మ హీంద్రా, బలేనో కార్లు, రూ.30 లక్షల విలువైన గృ హోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు గు ర్తించారు. తనిఖీల్లో రూ.2.50లక్షల విలువై న 19 విదేశీ మద్యం బాటిళ్లు, ఒక ఐఎమ్‌ఎఫ్‌ఎల్ బాటిల్ లభ్యమవ్వగా, మాదాపూర్ ఎ క్సైజ్ స్టేషన్లో వేరేగా కేసు నమోదైంది. ప్రస్తు తం జరిపిన సోదాల్లో లభించిన ఆస్తుల మొ త్తం విలువ రూ.27,65, 02,135గా తే లిం ది. బహిరంగ మార్కెట్‌లో రూ. వంద కో ట్ల కు పైగా ఉంటుందని అధికారుల అంచనా.
మారని నైజం..
2019 డిసెంబర్ 12న సైబర్ సిటీ సర్కిల్ కార్యా లయంలో పనిచేస్తున్న సమయంలో, ఫైలు అనుమతి కోసం రూ. 25వేల లంచం తీసుకుంటూ వెంకట రమణ ఏసీబీకి పట్టుబడి, సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ సర్వీసులోకి వచ్చి అదే స్థాయిలో అక్రమాలకు పాల్పడటం గమనార్హం.






