కేంద్రం గుడ్ న్యూస్
- తెలంగాణలో బియ్యం సేకరణ లక్ష్యం పెంపు
- 35 లక్షల నుంచి 43 లక్షల టన్నుల కొనుగోలుకు నిర్ణయం
- ప్రధాని, కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావు కృతజ్ఞతలు
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (12 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం) కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం సేకరణ మొత్తం 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు కేంద్రం నిర్ణయించింది. బీజేపీ ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తుల మేరకు బియ్యం సేకరణను పెంచినందుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావులు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం..
రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై..
తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, బియ్యం సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు (అంటే 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానం) పెంచు తూ నిర్ణయం తీసుకుందన్నారు. 8 లక్షల మె ట్రిక్ టన్నుల అదనపు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్విని యోగం చేసుకోవాలన్నారు.
బియ్యా న్ని సేకరించి భారత ఆహార సంస్థ ఎఫ్‌సీఐకు సకా లంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలన్నా రు. ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్న బియ్యాన్ని గత మార్కెటింగ్ సీజన్లలో నిర్ణీత గడువులో ఎఫ్‌సీఐకి ఇవ్వలేదన్నారు. గతం లో అంగీకరించిన పరిమాణంలో బియ్యాన్ని అప్పగించలేక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది పలుమార్లు బియ్యాన్ని ఇవ్వడానికి అదనపు గడువు కోరుతూ కాలయాపన చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా.. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో వెళ్లి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు పూర్తిచేసి, కేంద్రానికి ఇచ్చిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 30లోగా వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టం: కేంద్రమంత్రి బండి సంజయ్..
రబీ సీజన్‌కు సంబంధించి అదనం గా 8 లక్షల మెట్రిక్ టన్నులు పెంచుతూ కేంద్రం ఆమోదం తెలిపిందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వె హికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టంను సెప్టెంబర్ 30లోపు పూర్తిగా అమలు చేయాలని కేంద్రం నిర్ధారించిందన్నారు. వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బండి సం జయ్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.
రైతాంగానికి మేలుచేసే నిర్ణయం: రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణలో బియ్యం సేకరణ 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం రైతాంగానికి ఎంతో మేలు చేసే నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం కల్పించిన అవకాశాన్ని రాష్ట్రం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల నుం చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, భారత ఆహార సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులో బియ్యాన్ని గడువులోగా అప్పగించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.






