భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న హైకోర్టు జడ్జి సూరెపల్లి నంద
07-03-2026 09:50 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద శనివారం దర్శించుకుని భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి రామాలయంనకు చేరుకున్న జస్టిస్ నందాకు ఆలయం మర్యాదలు ప్రకారం స్వాగతం అధికారులు అర్చకులు పలకగా, మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తయారు అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.




