12 May, 2026 | 1:21 PM

అరబిందో ఎండీకి హైకోర్టు నోటీసులు

22-06-2024 12:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): అరబిందో ఫార్మా ఎం డీ రామ్‌ప్రసాద్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని మక్తహబూబ్‌పేట్‌లోని సర్వే నెంబర్ 44లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని పేర్కొం టూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అలాగే సర్వే నెంబర్ 44లో 68.17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, అలాగే సర్వే నెంబర్ 44/2లో 12 గుంటల స్థలం, సర్వే నెంబర్ 44/3/1లో 49.08 ఎకరాలు, సర్వే నెంబర్ 44/3/2లో 5.32 ఎకరాల స్థలం, సర్వే నెంబర్ 44/4లోని 69.23 ఎకరాలు, సర్వే నెంబర్ 44/5/2లోని 6 ఎకరాలు, సర్వే నెంబర్ 44/5/ఏ లో 11 ఎకరాలలో జరుగుతున్న ఆక్రమణలు, నిర్మాణాలపై 2024 జూన్ 6వ తేదీ నుంచి 2024 జూన్ 14వ తేదీ వరకు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు పిటిషన్‌దారుడి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సర్వే నెంబర్‌లో 44లోని ప్రభుత్వ స్థలాన్ని అరబిందో ఎండీ రాంప్రసాద్ రెడ్డి, అతని అనుచరులు గుండాల రాఘవేందర్‌రావు, గుండాల సర్వోత్తమ్‌రావు అక్రమిస్తున్నారని పిటిషన్ (నెంబర్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం గతంలో జీవన్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.