8 June, 2026 | 9:54 PM

Breaking News

మంథనిలో ప్రశాంతంగా ముగిసిన గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు   •   ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •  

అర్చకుల బదిలీపై హైకోర్టు స్టే

16-07-2024 01:13 AM

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఆలయాల్లోని అర్చకుల బదిలీ ప్రక్రియను నిలిపివేస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని ఆలయాల్లోని అర్చకుల బదిలీ ఆప్షన్లను కోరుతూ దేవాదాయశాఖ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కే శ్రీమన్నారాయణా చార్యులు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం మతపరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని, ఆలయ నిర్వహణ, పరిపాలనను మాత్రమే పర్యవేక్షించాలని అన్నారు. అర్చకులను ఉద్యోగిగా పరిగణి స్తూ బదిలీకి ప్రయత్నాలు చేయడం చెల్లదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి బదిలీ ప్రక్రియపై స్టే విధిస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.