26 May, 2026 | 6:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

జీవో నెం.9 పై తెలంగాణ హైకోర్టు స్టే

09-10-2025 04:22 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(High Court)లో బీసీ రిజర్వేషన్లపై విచారణ ముగిసింది. విచారణ అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు న్యాయమూర్తి రెండు వారాల సమయం ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిచిపోనుంది. కాగా హైకోర్టులో గత రెండు రోజుల నుంచి వాదనలు కొనసాగిన విషయం తెలిసిందే.