calender_icon.png 9 October, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటిఫికేషన్ వచ్చాక న్యాయస్థానాల జోక్యం ఉండదు: అడ్వకేట్‌ జనరల్‌

09-10-2025 03:24:00 PM

బీసీ రిజర్వేషన్లపై రెండో రోజు హైకోర్టులో విచారణ

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉంది.

సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలింది.

బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం.

ప్రభుత్వ సూచనలను హైకోర్టుకి తెలియచేస్తున్న అడ్వకేట్‌ జనరల్‌.

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (BC) రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించనుంది. రెండో రోజు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ సూచనలను అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి(Advocate General Sudarshan Reddy) హైకోర్టుకి తెలియజేస్తున్నారు. బీసీ కుల గణనకు చేసేందుకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని ఏజీ స్పష్టం చేశారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారు.. సర్వేపై ఎవరూ అభ్యతరం వ్యక్తం చేయలేదని తెలిపారు.

బీసీ జనాభా 57.6 శాతం ఉన్నారనడంలో ఎవరూ కాదనడం లేదని చెప్పారు. 57.6 శాతం జనాభా ఉన్నా.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఏజీ వెల్లడించారు. రాజకీయ వెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గుర్తించి తీర్మానం చేసిందని తెలిపారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని పేర్కొన్నారు. గడువులోకా గవర్నర్ ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని ఏజీ వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫై చేయనక్కర్లేదని ఏజీ అన్నారు. అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందన్నారు.

ఇది రాష్ట్ర ప్రజల కోరిక.. దాన్ని అసెంబ్లీ ఆమోదించిందని ఏజీ స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే జరిగింది. సర్వేలో అన్ని కులాల లెక్కలు తెలిశాయి. బీసీల్లోని సబ్ కేటగిరీల వారీగా వివరాలు సర్వేలో తేలాయి. సర్వేలో అగ్రవర్ణాల లెక్కలు కూడా బయటకు వచ్చాయని ఏజీ హైకోర్టుకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందన్నారు. కొందరు ఇది నోటిఫికేషన్ కాదంటున్నారు.. అది తప్పు అన్నారు. నోటిఫికేషన్ ప్రతులను ఏజీ సుదర్శన్ రెడ్డి ధర్మాసనం ముందుంచారు. నోటిఫికేషన్ వచ్చాక న్యాయస్థానాల జోక్యం ఉండదని ఏజీ వెల్లడించారు. నోటిఫికేషన్ వచ్చాక జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని తెలిపారు.