calender_icon.png 9 October, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతామణి నూనె ఎమ్మార్పీపై గందరగోళం

09-10-2025 04:43:02 PM

ముందు 50.. వెనకాల 100 ధర..

సూపర్ మార్కెట్ యజమాని అడగగా కంపెనీ నుండే వచ్చిందని సమాధానం..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విశ్వసూపర్ మార్కెట్ లో ఓ వినియోగదారుడు చింతామణి నూనె కొనుగోలు చేశాడు. సూపర్ మార్కెట్ యజమాని వంద రూపాయల బిల్లు తీసుకొని సీసాను వినియోగదారుడికి అందజేశాడు. సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి చూసేసరికి సీసా ముందు భాగంలో 50 రూపాయల ధర ఉండగా దాని వెనుక భాగంలో 100 రూపాయల ధర స్టిక్కర్ అంటించి ఉంది. ఇది గమనించిన వినియోగదారుడు సూపర్ మార్కెట్ యజమానిని ప్రశ్నించగా అది కంపెనీ నుండే వచ్చిందని తము ఏమి చేయలేమని సమాధానం ఇచ్చాడు. చింతామణి నూనె సరఫరా చేస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఓకే సీసాపై రెండు విధాల ఎమ్మార్పీ ధరను ముద్రించడం పట్ల కంపెనీ యొక్క నిర్లక్ష్యం కండ్లకు కనబడుతుంది.