11 June, 2026 | 2:07 AM

హైదరాబాద్‌లో హై లైఫ్ ఎగ్జిబిషన్

11-06-2026 01:13 AM

12 నుంచి వైభవంగా ప్రారంభం 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఫ్యాషన్, లైఫ్‌స్టుల్ ప్రియుల కోసం హైదరాబాద్‌లో అత్యుత్తమ వేదికగా నిలిచిన ‘హై లైఫ్ ఎగ్జిబిషన్’ ఈ సరికొత్త సీజన్ - మాన్సూ న్ కలెక్షన్లతో మరోసారి నగరవాసులను అలరించడానికి సిద్ధమైంది. సరికొత్త డిజైన్ల ప్ర దర్శనతో జూన్ 12, 13, 14 తేదీలలో మాదాపూర్‌నోవాటెల్ హెచ్‌ఐసిసిలో ఈ ఎగ్జిబిషన్ వైభవంగా నిర్వహించనున్నారు. భారత దేశం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ప్రత్యేకమైన కలెక్షన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఫ్యాషన్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్, అద్భుతమైన జ్యువెలరీ, స్టైలిష్ యాక్సెసరీస్, ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ‘హైదరాబాద్ కి ఎల్లప్పుడూ ఫ్యాషన్ పట్ల ప్రత్యేకమైన ఆదరణ ఉంది.  జూన్ 12, 13, 14 తేదీలలో నో వాటెల్ హెచ్‌ఐసిసిలో ఉదయం 10 నుండి సాయంత్రం 8 గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనను సం దర్శించాల్సిందిగా  కోరుతున్నామన్నారు.