calender_icon.png 18 February, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీల్లో హైమాస్టు లైటింగ్

16-02-2026 12:00:00 AM

ములకలపల్లి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాత్రిపూట అధిక వెలుతురును ఇచ్చే ఐమాస్ట్ లైటింగ్ దీపాలను గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేశారు. ములకలపల్లి మండలంలోని సీతారాంపురం, పూసుగూడెం,మాదారం, జగన్నాథపురం, ములకలపల్లి పంచాయతీలు పాల్వంచ- దమ్మపేట ప్రధాన రహదారిపై ఉన్నాయి. ఈ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది.

రాత్రిపూట అధిక వెలుతురును ఇచ్చే ఐమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడంతో రహదారిపై ప్రయాణించే వాహనాలను గుర్తించడం సులభం అవుతుంది. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక్కొక్క ఐమాస్ట్ లైటింగ్ స్తంభానికి 1.75 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు.

13 అడుగుల నుంచి 30 అడుగుల ఎత్తు గల స్తంభానికి చివరి భాగాన నలువైపులా ఆరు విద్యుత్ దీపాలను కలిపి ఒకే స్తంభానికి ఏర్పాటు చేయడంతో రాత్రిపూట పగలు వలె వెలుతురు వెదజల్లుతుంది. హైవే రహదారుల ప్రక్కన ఉండే ఐమాస్ట్ లైటింగ్ విధానాన్ని గ్రామపంచాయతీల్లోని ప్రధాన రహదారి కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.