31 July, 2026 | 8:21 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు

13-04-2026 12:44 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి, ఏప్రిల్ 12(విజయక్రాంతి): రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పంట లాభదాయకమని, తాను గ్యారంటీ ఇస్తానని స్పష్టం చేశారు. ఆదివారం చిగురుమామిడి రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 24 మంది రైతులకు రూ.40. 80 లక్షల విలువైన పనిముట్లు, యంత్రాలను పంపిణీ చేశారు.

ఇందులో రోటా వేటర్లు, బేయిలర్లు, పవర్ స్ప్రేయర్లు ఉన్నా యి. ప్రతి చిన్న గ్రామంలో 50 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 100 ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. అంతర పంటలు కూడా వేసుకోవచ్చని, ఎక్కువగా సాగు చేసే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అవసరమైన రైతులు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే అదనపు పరికరాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు త్వరలో పూర్తి చేస్తామని, భూములు ఇవ్వాలని రైతులను కోరారు.అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

  తెలంగాణ పబ్లిక్ స్కూల్కు స్థల పరిశీలన 

చిగురుమామిడిలో 4 ఎకరాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం మంత్రి స్థలాన్ని పరిశీలించారు. ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఆర్థివో మహేశ్వర్, సర్పంచ్ ఆకవరం భవాని, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తాసిల్దార్ రమేష్, ఎంపీడివో విజయకుమార్, సర్పంచులు, ఉప సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.