1 July, 2026 | 7:56 PM

Breaking News

ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •  

అధిక విక్రయాలు సాధించిన హైటెక్ పైప్స్

06-01-2025 12:00 AM

హైదరాబాద్, జనవరి 5: స్టీల్ ట్యూబులు, పైపుల తయారీలో  ప్రముఖ సంస్థ అయిన హైటెక్ పైప్స్ లిమిటెడ్  ప్రస్తుత ఆర్థి క సంవత్సరం మూడవ త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు జరిపింది. క్యూ3లో 1,24, 233 ఎంటి విక్రయ పరిమాణాన్ని సాధించామని,  26.10 శాతం వార్షిక వృద్ధిని కనపర్చి నట్లు హైటెక్ పైప్స్ ఒక ప్రకటనలో తెలిపిం ది.

2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ెేడిసెంబర్ మధ్య తొమ్మిది నెలల్లో విక్రయ పరిమాణం 30.33 శాతం వృద్ధితో 3,69, 415 ఎంటికు పెరిగినట్లు పేర్కొంది. ఈ వృద్ధికి ముఖ్య కారణం సౌర టార్క్ ట్యూబులని, దేశం సౌర విద్యుత్ రంగం వేగం గా విస్తరిస్తుండటంతోతమ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువైందని కంపెనీ వివరించింది.

పునరుద్పాదక విద్యుత్ రంగంతో పాటు, మౌలిక వసతులు, నిర్మాణ రంగాలకు కూడా పైపుల సరఫరాలో గణనీయమైన వృద్ధి సాధించామని  హైటెక్ పైప్స్  చైర్మన్ అజయ్ కుమార్ బన్సల్  తెలిపారు.  హైటెక్ పైప్స్‌కు 20 రాష్టాల్లో 450కుపైగా డీలర్లతో దేశవ్యాప్తంగా విస్తృత మార్కెటింగ్ నెట్‌వర్క్ ఉన్నది.