1 July, 2026 | 6:37 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

స్వల్పంగా పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ వృద్ధి

06-01-2025 12:02 AM

న్యూఢిల్లీ, జనవరి ౫: దేశం లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం క్ రుణవితరణ క్యూ3లో స్వల్పంగా పెరిగింది. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తమ అడ్వాన్సులు క్రితం ఏడాది క్యూ3తో పోలి స్తే 3 శాతం పెరిగి రూ.25.42 లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్ తాజా బిజినెస్ అప్‌డేట్‌లో తెలిపింది.

2023 డిసెంబర్ చివరినాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొత్తం అడ్వాన్సులు రూ.24.69 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు క్యూ3లో 15.8 శాతం వృద్ధితో రూ.22.14 లక్షల కోట్ల నుంచి రూ.25.63 లక్షల కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ వెల్లడించింది. 

ఇండియన్ బ్యాంక్ రుణ వృద్ధి 9.6 శాతం

ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ రుణ వృద్ధి ముగిసిన అక్టోబర్ త్రైమాసికంలో 9.6 శాతం పెరిగి రూ.5.59 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో బ్యాంక్ ఇచ్చిన మొత్తం రుణాలు రూ.5.10 లక్షల కోట్ల మేర ఉన్నాయి. క్యూ3లో డిపాజిట్లు 7.3 శాతం వృద్ధితో రూ.7.02 లక్షల కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.