1 August, 2026 | 3:16 AM

అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి అత్యున్నత పురస్కారం

01-08-2026 02:26 AM

లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు   

ఆయన్ని ఘనంగా సన్మానించిన పలువురు

కొత్తపల్లి, జూలై 31 (విజయక్రాంతి): అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డికి యునైటెడ్ కింగ్‌డమ్ సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రధానం చేయడంతో ప్రతిష్ఠాత్మక లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభలో ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, పలు సేవా సంస్థలు, యువజన సంఘాలు, విద్యావేత్తలు, శిక్షణ నిపుణులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, క్రీడా సంఘాల ప్రతినిధులు నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.   ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.