హిందాల్కో నికరలాభం రూపాయి 3174 కోట్లు
న్యూఢిల్లీ, మే 24: ఆదిత్యా బిర్లా గ్రూప్ మెటల్ కంపెనీ హిందాల్కో కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 31.6 శాతం వృద్ధిచెంది రూ. 3,174 కోట్లకు చేరింది. కాపర్, అల్యూమినియం అమ్మకాల పరిమాణం పెరగడం, మార్జిన్ల వృద్ధితో పటిష్ఠమైన లాభాల్ని ఆర్జించగలిగింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలా భం రూ. 2,411 కోట్లు. టర్నోవర్‌లో ప్రపంచంలోకెల్లా పెద్ద అల్యూమినియం కంపెనీ అయిన హిందాల్కోకు భారత్ రాగి డిమాండ్‌లో 50 శాతం వాటా ఉన్నది. ముగిసిన క్యూ4లో హిందాల్కో కన్సాలిడేటెడ్ ఆదాయం ఫ్లాట్‌గా రూ.55,994 కోట్ల వద్ద నమోదయ్యింది. ముడి వ్యయా లు తగ్గడం, అధిక అమ్మకాల పరిమాణంతో కంపెనీ ఇబిటా 24 శాతం వృద్ధితో రూ. 5,818 కోట్ల నుంచి రూ. 7,201 కోట్లకు చేరింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.3.50 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది.






