calender_icon.png 19 January, 2026 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆందోళన

19-01-2026 04:27:16 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. సోమవారం ర్యాలీగా తరలివచ్చి ఎంఎల్ఏ వివేక్ వెంకట స్వామి క్యాంపు కార్యాలయం ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ... మున్సిపాలిటీలో హిందూ స్మశాన వాటిక తక్షణమే నిర్మించాలి.

నూతన కూరగాయల మార్కెట్ లో తగిన వసతులు కల్పించాలని కోరారు. అలాగే చెన్నూర్ బైపాస్ రోడ్డు తక్షణం పూర్తి చేయాలని, చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, బస్సు డిపో నిర్మాణం పనులు తక్షణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.