calender_icon.png 29 September, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులు అప్రమత్తంగా ఉండి, మన ధర్మం గొప్పతనం తెలుసుకోవాలి

29-09-2025 12:00:00 AM

మంథనిలో ఆయుధపూజలో విశ్వహిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్

మంథని, సెప్టెంబర్ 28(విజయ క్రాంతి) దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గాంధిచౌక్ మంథని ఆద్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూప రిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మాట్లా డుతూ అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలని ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని కోరారు.

భజరంగ్ దళ్ మంథని ప్ర ఖండ అద్యక్షులు నరేడ్ల రాజేష్ మాట్లాడుతూ హిందూ యువకులంతా ఒక్కటిగా ఉండాలని, హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఆయుధ పూజ ద్వారా శక్తి ఉపాసన చేసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మత మార్పిడి ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థను, లవ్ జిహాద్ ద్వారా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని.

హిందువులు అప్రమత్తంగా ఉండాలని మన ధర్మం గొప్పతనం తెలుసుకోవాలని కోరారు. భజరంగ్ దళ్ మంథని ఉపాధ్యక్షులు బొగే సందీప్ మాట్లాడుతూ హిందూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మనలో మనం కులాల, వర్గాల, రాజకీయాలకు అతీతంగా ఉంటూ గొడవలు పడకుండా ఉండాలని. హిందూ యువతను సంఘటితం చేయడమే లక్ష్యంగా ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని యువత ఈ ఉత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి నామిని నాగేష్ మాట్లాడుతూ అమాయక హిందూ అమ్మాయిలను వలలో వేసుకొని మోసం చేసే జిహాదీ మూకల అంతమే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ ఉపాధ్యక్షులు రావుల సతీష్, కార్యదర్శి బత్తుల సత్యనారాయణ, సత్సంగం ప్రముఖ్ రాజమౌళి గౌడ్ , ప్రచారప్రముఖ్ తూర్పాటి రాము, మాచిడి శ్రీధర్, కందునూరి ఈశ్వర్ అధిక సంఖ్యలో భక్తులు , భవాని స్వాములు, భవాని మాతలు పాల్గొన్నారు.