29-09-2025 12:00:00 AM
మఠంపల్లి, సెప్టెంబర్ 28: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వేదికలపై ఎన్నో చారి్ర తాత్మక, పౌరాణిక పాత్రలలో తన కళా ప్రతి భను ప్రదర్శించిన మండలానికి చెందిన డాక్టర్ గుంటి పిచ్చయ్యను విశ్వ జననీ అభి నయ శిల్పి అవార్డుకు ఎంపిక చేసినట్లు విశ్వజనని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొగ్గారపు బ్రహ్మానందం ఆదివారం తెలి పారు. నవంబర్ ఒకటవ తేదీన హైదరా బాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్శి టీలో జరుగు విశ్వజనని ప్రతిభ పురస్కా రాలు సందర్భంగా విశ్వజనని అభినయ శిల్పి అవార్డుతో పిచ్చయ్యను సత్కరించను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ నటులు ప్రముఖ రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు పాల్గొంటారన్నారు.