11-11-2025 12:00:00 AM
కోకాపేట్, మూసాపేట్ ప్లాట్ల వేలానికి ఈ నెల 17న ప్రి-బిడ్ సమావేశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్ల ఈ-వేలానికి సంబంధించి ప్రీ--బిడ్ సమావేశం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించింది. రంగారెడ్డి జిల్లా కోకాపేట్ సర్వే నంబర్లు 239, 240లో ఉన్న నియోపొలిస్ లేఅవుట్‌లో-6 ప్లాట్లు, కోకాపేట్ గోల్డెన్ మైల్ లేఅవుట్‌లో-1 ప్లాట్, మేడ్చల్ జిల్లా మూసాపేట్‌లోని సర్వే నంబర్లు 121141, 146, 147, 155157లో ఉన్న 2 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించనుంది.
ఈ నెల 17న రాయదుర్గంలోని హైదరాబాద్ నాలేడ్జ్ సిటీ టీహబ్‌లో ప్రీ-బిడ్ సమావేశం ఉంటుంది. డెవలపర్లు, బిల్డర్లు, ఇన్వెస్టర్లు, ఆసక్తి కలిగిన వ్యక్తులు ఈ ప్రీ-బిడ్ సమావేశానికి హాజరై ఈ--ఆక్షన్ ప్రక్రియ, ప్లాట్ వివరాలు, నిబంధనలపై సమగ్ర సమాచారం పొందవచ్చు. ఆక్షన్ తేదీలు, నమోదు విధానాలకు సంబంధించిన పూర్తి వివరాలు హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ www.hmda.gov.inలో అందుబాటులో ఉంటాయి.