9 June, 2026 | 2:32 AM

కాంగ్రెస్.. ప్రజాసంక్షేమ ప్రభుత్వం

09-06-2026 12:29 AM

దామరగిద్ద, రామన్నగూడ, ఇబ్రహీంపల్లిలో సభల నిర్వహణ

చేవెళ్ల, జూన్ 8 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు చేవెళ్ల పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డులలో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక వార్డు సభలు సోమవారం ఘనంగా నిర్వహించారు. దామరగిద్ద, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి వార్డులలో జరిగిన వార్డ్ సభలకు స్థానిక కౌన్సిలర్లు, తాళ్లపల్లి నర్సింలు, పెద్దోళ్ల దయాకర్, పైండ్ల మధుసూదన్ రెడ్డి మున్సిపల్ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఈ సమావేశాలకు చేవెళ్ళ మునిసిపల్ చైర్ పర్సన్ సమత వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాలకవర్గం మున్సిపల్ అభివృద్ధి ప్ర జా సంక్షేమంగా లక్ష్యంగా పనిచేస్తున్నారన్నా రు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు 5 00/- గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రైతుబంధు రైతు బీమా, ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి 10 ల క్షల పెంపు, వంటి ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

అధికారులు మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరి మాట్లాడుతూ... వార్డుల సమగ్ర అభివృద్ధి, ప్రజల సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, స్థానిక సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇ చ్చారు. వార్డు ఆఫీసర్లు, పోలీస్ సిబ్బంది వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.