9 June, 2026 | 2:32 AM

కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

09-06-2026 12:29 AM

నిర్మల్ జూన్ 8 (విజయ క్రాంతి) : దేశంలో పెరిగిన ఎరువులు ధరలను తగ్గించి స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నందిరామయ్య మాట్లాడుతూ దేశంలో ఎరువులు ధరలను పెంచడం అన్యాయమని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర పెంచాలని డీజిల్ పెట్రోల్ ధరలను వ్యవసాయ రంగానికి వినయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజన్న సోనియా రావు తదితరులు ఉన్నారు.