విద్యా కమిషన్ సిఫారసులు వెంటనే రద్దు చేయాలి
04-03-2026 12:23 AM
నాగర్ కర్నూల్, మార్చి 3 (విజయక్రాంతి) తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో రూపొందించిన విధాన పత్రంలోని అసంబద్ధ సిఫార సులను తక్షణమే తొలగించాలని నాగర్ కర్నూల్ జిల్లా టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం ఓ ప్రైవేటు కార్యాలయ వేదికపై సమావేశమయ్యారు. మం డలానికి 34 పాఠశాలలే పరిమితం చేయ డం, ఉత్తీర్ణత శాతం 75%కు పెంపు, ఉపాధ్యాయుల కాంట్రాక్ట్ విధానం, వేతనాల తగ్గింపు వంటి ప్రతిపాదనలు ఆచరణ సా ధ్యం కాదన్నారు. ఉపాధ్యాయ శిక్షణ సూచనలు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యు కేషన్ నిబంధనలకు విరుద్ధమన్నారు.అసంబద్ధ సిఫారసులను రద్దు చేసి విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా సిద్ధం చేయాలన్నారు.




