పాలమూరు అంత హోలీ సంబరం
14-03-2025 11:45 AM
చిన్న పెద్ద భేదం లేకుండా హోలీ వేడుకల్లో
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): హోలీ వేడుకలు(Holi celebrations) జిల్లా వ్యాప్తంగా రంగురంగుల్లో సంబురంగా జరిగాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన హోలీ సంబరాల్లో పెద్ద చిన్న బేధం లేకుండా రంగులు చల్లుకొని తమ సంతోషాన్ని వెలబుచ్చుకున్నారు. ఈ క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్(Former Municipal Chairman Anand Goud) చిన్నారులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.






