25 August, 2026 | 11:09 AM

నెమలి జాతరకు ప్రత్యేక బస్సులు

14-03-2025 11:43 AM

ప్రయాణికులకు ఉచిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు..

మండలంలో మూడు గ్రామాల కేంద్రంగా బస్సు సౌకర్యం..

వైరా, (విజయక్రాంతి): నెమలిలో శ్రీ ప్రసిద్ధగాంచిన వేణుగోపాలస్వామి పుణ్యక్షేత్రం(Sri Venugopalaswamy Temple) వద్ద నిర్వహించే జాతరకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఆర్టీసీ  మదిరి డిపో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మదిరి డిపో  ట్రాఫిక్ ఇంచార్జి మధిర గాదే రాంరెడ్డి, స్టేషన్ మేనేజర్ బి వెంకటేశ్వర్లు  తెలిపారు.. వైరా మండల పరిధిలోని గండగల పాడు మీదుగా లక్ష్మీపురం సిరిపురం మీదుగా నెమలి జాతరకు ఒక బస్ సర్వీసును,అదేవిధంగా రెబ్బవరం నుండి గన్నవరం మీదుగా మరొకటి, స్టేజి పినపాక నుండి మూడు బస్సుల సర్వీసులను నడుపుతున్నారు.

ఆధార్ కార్డు(Aadhaar card) ప్రామాణికంగా మహిళలకు ఉచితంగా సర్వీస్నందిస్తున్నామన్నారు.ఫుల్ టికెట్ చార్జీ 50 రూపాయలు సగం చార్జి 30 రూపాయలుగా నిర్వహించి ఈ సర్వీస్ లను అందిస్తున్నామని, జాతరకు ఉదయం ఏడు గంటల నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామని తెలిపారు.,పుణ్యక్షేత్రంలో కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంతవరకు ఈ సర్వీసులను కొనసాగుతాయని అన్నారు అదేవిధంగా ప్రయాణికులకు ఉచితంగా మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు, మొత్తం ఏడుగురు మదిర డిపో ఆర్టీసీ ఉద్యోగులు జాతర విధులు నిర్వహిస్తున్నట్లు, సురక్షితంగా  ప్రయాణం సాగించేందుకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని వారు కోరారు.