7 నుంచి అసెంబ్లీ
మంత్రి కొండా సురేఖ అంశంపై ఎవరూ మాట్లాడొద్దు
- నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించండి
- సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై నిర్లక్ష్యం చేయవద్దు
- మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
- అంతకుముందు సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశా లకు తేదీ దాదాపుగా ఖరారయ్యింది. సెప్టెంబర్ 7నుంచి అసెంబ్లీ సమావేశా లు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సచి వాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. విదేశీపర్యటన ముగి ంచుకుని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శు భాకాంక్షలు తెలిపారు.
అంతకుముం దు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలుసుకున్నారు. విదేశీ పర్యటన, మం త్రి కొండా సురేఖ అంశంతో పాటు అ మెరికా పర్యటన రద్దుకావడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మంత్రి కొండా సురేఖ అంశంపై పార్టీ నేతలెవ్వరూ మాట్లాడకుండా కట్టడి చేయాలనే చర్చించినట్లు తెలిసింది.
ఆ తర్వాత సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మం త్రి కొండా సురేఖ అంశాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని, ఇకపై ఎవ రూ ఆ అంశాన్ని మాట్లాడొద్దని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భూసేకరణను నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావన్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ నిధులను వెంటనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, నాయకుడూ తమ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు.
సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్‌సాగర్‌రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమాయి, మందుల సామేల్, వేడ్మ బొజ్జు, కోరం కనకయ్య, కాంతారావు, రామ్‌దాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్‌రెడ్డి, తెల్లం వెంకట్‌రావు, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళినాయక్, యశస్వినీరెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘువీర్‌రెడ్డి, అనిల్ కుమార్‌యాదవ్, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులున్నారు.






