25 August, 2026 | 9:55 AM

ఉప్పొంగిన ఎగువ మానేరు.. తెగిపోయిన మట్టి రోడ్డు

25-08-2026 09:15 AM

గంభీరావుపేట, ఆగస్టు 25 (విజయ క్రాంతి): నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహించడంతో గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి-సిద్దిపేట మధ్య రాకపోకలు  అంతరాయం ఏర్పడింది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం లెవెల్ వంతెనను కూల్చి మూడేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదు. పిల్లర్లు కూడా పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.