26 June, 2026 | 7:23 PM

Breaking News

జూబ్లీహిల్స్ ఎస్టేట్‌లో హోలీ వేడుకలు

04-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): అసఫ్ జాహీ వంశానికి చెందిన ప్రస్తుత కస్టోడియన్, 9వ నిజాం నవాబ్ రౌనక్ యార్ ఖాన్, గత 50 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన ప్రైవేట్ ఎస్టేట్ లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా తన ఖర్చులతో నిర్వహించగా, అన్ని వర్గాల ప్రజలకు ఆహ్వానం అందించారు.  హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ స్మారకార్థం గా నిర్వహించబడ్డాయి.

సామరస్యానికి, దా తృత్వానికి ప్రతీకగా నిలిచిన మహబూబ్ అలీ ఖాన్ స్ఫూర్తిని కొనసాగించడమే ఈ వేడుకల ఉద్దేశమని నవాబ్ రౌనక్ యార్ ఖాన్ తెలిపారు. హోలీ మనందరినీ కలిపే పండుగ.. పరస్పర గౌరవం, సామరస్యం, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని గుర్తు చేసే వేడుక ఇది. ఇదే భారత దేశం అసలు ఆత్మ అని ఆయన అన్నారు. మతపరమైన ఏర్పాట్లను శ్రీరామానమూర్తి సమన్వయం చేశా రు. ఈ ఏడాది వేడుకలకు జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న జై హో కూడా సహకారం అందించింది.