4 March, 2026 | 10:33 AM

స్నేహితహిల్స్‌లో విద్యుత్ సబ్ స్టేషన్‌ను తొలగించాలి

04-03-2026 12:00 AM

రాజేంద్రనగర్, మార్చి 3(విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని స్నేహిత హిల్స్ లో ఇండ్ల మధ్య ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను ఇక్కడి నుండి తరలించి కాలనీవాసుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలని స్నేహిత కాలనీ ప్రజలు కోరుతున్నారు.

2021 సంవత్సరం  కరోనా సమయంలో స్నేహిత హిల్స్‌లో ఇండ్ల మధ్య నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సబ్ స్టేషన్ నుండి 11 కె.వి విద్యుత్  వైర్లతో కార్పొరేట్ కంపెనీలకు కమర్షియల్ షాపింగ్ మాల్స్ భవనాలకు విద్యుత్ సరఫరా కావడం వల్ల హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా అవుతుందని, దీనివల్ల తాము ఎన్నో ఇబ్బందులకు భయాందోళనలకు గురవుతున్నామని తక్షణమే సబ్ స్టేషన్‌ను ఇక్కడ నుండి తొలగించాలని కాలనీవాసి కొట్ర కృష్ణమూర్తి,  కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.