3 March, 2026 | 9:41 PM

వరంగల్ కమిషనరేట్‌లో ఘనంగా హోలీ సంబరాలు

03-03-2026 07:57 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బ్యాండ్ వాయిద్యాల మధ్య పోలీస్ అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను, అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, రంగులతో ముంచెత్తారు. అనంతరం ఒకరికి ఒకరు రంగులు జల్లుకుంటూ పోలీస్ కమిషనర్ దంపతులతో పాటు అధికారులు, సిబ్బంది తీన్మార్, నాగిన్ డాన్స్ స్టెప్పులతో నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో, ఆనందోత్సాహాలనడుమ హోలీ పండుగ వేడుకలు జరిగాయి. అధికారులు, సిబ్బందికి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, హోలీ పండుగ సౌహార్దం, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి, సంతోషాలతో పండుగను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీ సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.