3 March, 2026 | 2:59 AM

బేగంబజార్‌లో హోలీ సంబురాలు

03-03-2026 01:16 AM

హైదరాబాద్, మార్చి ౨(విజయక్రాంతి): బేగంబజార్‌లో హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. బేగంబజార్ హోలీ ఉత్సవ సమితి, అధ్యక్షులు అవినాష్ దేవుడా, మనిషి బాటి, గోవింద్, విజయ్ కుమార్, బజరంగ్ రాజ్ పన్వార్, రాజేష్ సోలంకిల ఆధ్వర్యం లో సోమవారం ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్వాడిలు, ఉత్తర భారతీయులు, గుజరాతీలు, వ్యాపారాలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ ఉత్సవాలను ఆనందంగా జరుపుకున్నారు.

సహజ సహజసిద్ధమైన ఆర్గానిక్ గులాల్ రంగులతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కోల్సావాడి మాలి సమాజ్ భవనం నుంచి ప్రారంభమైన ఈ హోలీ ర్యాలీ బేగంబజార్ మార్కెట్ అంతా కొనసాగింది.  బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ ఉత్సవంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో బేగంబజార్ ప్రాంతం అంతా రంగుల మయమైంది.

మార్కెట్‌లో హోలీ సందడి నెలకొన డంతో పండుగ వాతావరణం తారాస్థాయికి చేరింది. ఈ హోలీ సంబరాల్లో పుక్ రాజ్ కచ్చువా, రాజేష్ సోలంకి, హంసరాజ్ కచ్వా, దిలీప్, విజయ్ కుమార్ సోలంకి, బంకట్లాల్ బాటి, బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్, గోషామహల్ మాజీ కార్పొరేటర్ లాల్ సింగ్, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రావు, గోషామహల్ ఇన్‌స్పెక్టర్ బి శ్రవణ్ కుమార్ కుమార్ లతోపాటు వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.