3 March, 2026 | 3:11 AM

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

03-03-2026 01:18 AM

టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

కరెంట్ మీటర్ రీడింగ్ కార్మికుల ధర్నాకు మల్లన్న సంఘీభావం

హైదరాబాద్, మార్చి2(విజయక్రాంతి): కరెంట్ మీటర్ రీడింగ్ (పీఎంఆర్) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను స్వయంగా విని  వారికి పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరెంట్ మీటర్ రీడింగ్ కార్మికులు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనా లతో, భద్రతా హామీలు లేకుండా, స్థిరత్వం లేని పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ ప్రభు త్వం, సంబంధిత అధికారులు వారి సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖకు వెన్నెముకలా పనిచేస్తున్న ఈ కార్మికుల కష్టాలను గుర్తించకుండా ఉండటం దురదృష్టకరమన్నారు.

వారి సమస్యలపై కనీసం ప్రభుత్వంలో ఎవ్వరూ మాట్లాడటం లేదని, ఇది అన్యాయమని మల్లన్న అన్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ఔట్‌సోర్సింగ్ విధానం, బకాయి చెల్లింపుల వెంటనే విడుదల,భద్రతా సౌకర్యాలు, బీమా కల్పన వెంటనే పరిష్కరించాలన్నారు. రాబోయే శాసన మండలి సమావేశాల్లో మీటర్ రీడింగ్ ఉద్యోగుల సమస్యను మొదటి అంశంగా లేవనెత్తుతానని మల్లన్న హమీ ఇచ్చారు. దీంతో మల్లన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల న్యాయమైన హ క్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్లన్న స్పష్టం చేశారు.