విద్యుత్ ఉద్యోగుల పని ప్రతిజ్ఞ
05-03-2026 01:12 AM
నిర్మల్, మార్చి 4 (విజయక్రాంతి): విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని ఎంపీటీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ నాగరాజు అన్నారు. బుధవారం శాఖ కార్యాలయంలో విద్యుత్ లైన్మెన్ దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఉత్తమ లైన్మెన్ సన్మానం చేసి ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డిఇ వెంకటేశ్వర్లు పట్టణ ఏడి ఈ శ్రీనివాసరావు విద్యుత్ శాఖ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.




