4 March, 2026 | 1:52 PM

రామాయంపేటలో ఘనంగా హోలీ సంబరాలు

04-03-2026 12:27 AM

రామాయంపేట, మార్చి 3 : రామాయంపేట పట్టణములొ హోలీ సంబరాలు మిన్నంటాయి.  రామాయంపేట పట్టణం....రంగుల హరివిల్లుల మధ్య, నవ్వుల కిలకిలారావాలతో, డీజే మ్యూజిక్ బీట్లతో రామాయంపేట పట్టణం  హోలీ సంబరాల్లో తేలిపోయింది.

పండుగ అంటే ఇదే అనిపించేలా ప్రతి వీధి రంగులతో కళకళలాడింది.యువత డీజే మ్యూజిక్కు తాళం వేసి ఉత్సాహంగా నృత్యాలు...చిన్నారులు పిచ్కారీలతో రంగులు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ నినాదాలు...మహిళలు ఇంటి ముందు రంగులాడుతూ, ప్రత్యేక వంటకాలు పంచుకుంటూ ఆనందం పంచుకున్నారు.