ఘనంగా హోలీ పండుగ
04-03-2026 12:23 AM
- చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాల్లో పాల్గొన్న ప్రజలు
ఆయా పార్టీల రంగులతో హోలీ పండుగలో నాయకుల సందడి
గజ్వేల్, మార్చి3: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను మంగళవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండే చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు ఒకరిపై ఒకరు చల్లుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక హుస్నాబాద్ కేంద్రాలతో పాటు గ్రామాలలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల నాయకులు హోలీ పండుగ సంబరాలను జరుపుకున్నారు ఆయా పార్టీల శ్రేణులతో కలిసి నాయకులు రంగులు చల్లుకుంటూ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.




