3 August, 2026 | 5:34 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

53 కోట్లు దాటిన పుణ్య స్నానాలు

18-02-2025 12:55 AM
  1. మరో రెండు రోజులు పొడిగించే అవకాశం
  2. మహా కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, య మున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రి వేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 53 కోట్లు దాటినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

జనవరి 13న మొదలైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మ రో తొమ్మిది రోజులు జరగను న్న నేపథ్యంలో భక్తుల సంఖ్య 70 కోట్ల వరకు చేరే అవకాశముందని వెల్లడించా రు. అ యితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కుంభమేళాను మరో రెండు రోజులు పొ డిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

సెక్టార్-8లో అగ్ని ప్రమాదం

మహా కుంభమేళాలో సోమవారం మరో అగ్నిప్రమాదం సం భవించింది. సెక్టార్-8లో మధ్యా హ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గూడా రాలు దగ్ధమవగా ఎలాంటి ప్రా ణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆం దోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల కిందటే సెక్టార్ 18, సెక్టార్ 19 మధ్య అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.