20 March, 2026 | 1:53 PM

ఉరి వేసుకుని హోంగార్డు ఆత్మహత్య..

27-08-2024 10:50 AM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో ఓ హోంగార్డు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా తిలక్ నగర్ కు చెందిన మోహన్ అనే వ్యక్తి హోంగార్డు గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెలవారుజామున నగరంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో హోటల్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అనారోగ్య సమస్యలతో మోహన్ ఆత్మహత్య చేసుకునట్లు స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మోహన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సర్కారు దవాఖానకు తరలించారు. ఈ మేరకు టూ టౌన్  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వెల్లడించారు.