calender_icon.png 20 October, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

27-08-2024 11:13:47 AM

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. రాజన్న ఆలయానికి సోమవారం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు రాజన్న దర్శనం చేసుకొని బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించేందుకు వచ్చారు. డప్పు చప్పుళ్లు, శివ సత్తుల నృత్యాలు, నెత్తిన బోనాలతో చేసిన నృత్యాలు ఆకటుకున్నాయి. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ఒడి బియ్యం, నైవేద్యాన్ని సమర్పించారు.