07-12-2025 01:10:17 AM
-అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు
-పోలీస్ కమిషనర్ సజ్జనార్
-విధి నిర్వహణలో మృతి చెందిన 18 కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న హోంగార్డులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. వారి సంక్షేమం కోసం త్వరలోనే సిటీ పోలీస్ విభాగంలో ప్ర త్యేకంగా హోంగార్డ్ కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం పేట్లబురుజులోని సీఏఆరెడ్క్వార్టర్స్లో నిర్వహించిన హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో సుమారు 5 వేల మంది హోంగార్డులు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కో-ఆపరేటివ్ సొసైటీలో ఇప్పటికే 2,000 మంది చేరారని, మిగిలిన వారు కూడా వెంటనే సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. అరులైన హోం గార్డులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని గుర్తు చేశారు.లైసెన్స్ లేకుంటే బీమా రాదు..ప్రతి హోంగార్డు తమ డ్రైవింగ్ లైసెన్ ను విధిగా రెన్యూవల్ చేసుకోవాలని సీపీ హెచ్చరించారు.
లైసెన్స్ రెన్యూవల్ చేసుకోని పక్షంలో, దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగితే బీమా మంజూరులో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తుచేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతి, అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్ప వని సీపీ స్పష్టం చేశారు. క్రమశిక్షణతో మెలి గి పోలీస్ శాఖకు మంచిపేరు తేవాలని హిత వు పలికారు.అనంతరం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది హోంగార్డులకు సీపీ ప్రశంసా పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలోనూ, ఇతర కారణాలతోనూ మృతిచెందిన 18 మంది హోంగార్డుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీపీ సీఏఆర్రక్షిత కృష్ణమూర్తి, హోంగార్డ్స్ కమాండెంట్ కిషన్‌రావు పాల్గొన్నారు.