calender_icon.png 6 December, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం

06-12-2025 08:42:15 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శనివారం 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ హోంగార్డ్ వ్యవస్థ దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో తక్షణ స్పందన, సమర్థవంతమైన బందోబస్తు విధులు, ప్రజా రక్షణ చర్యల్లో హోంగార్డుల సేవలు అమూల్యమని కొనియాడారు.

విధుల్లో అంకితభావం, ప్రతిభ కనబరిచిన హోంగార్డులను సీపీ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్, ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, భీం రావు, ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, హోంగార్డు ఆర్ఐ శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.