calender_icon.png 6 December, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర యోగా పతక విజేతలకు మంత్రుల అభినందన..

06-12-2025 08:45:00 PM

ముకరంపుర (విజయక్రాంతి): ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎంపీ అంతర్జాతీయ పాఠశాలలో తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా యోగా క్రీడాకారులను శనివారం మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు అభినందించారు. ఎంపికైన క్రీడాకారులు రాంచిలో ఈనెల 27 నుంచి 30 వరకు జరుగు జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వి. అంజనీ కుమార్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, కార్యదర్శి గుంటి రామకృష్ణ, కోశాధికారి పి. స్వరూప చారి, బండ రమణారెడ్డి యోగ కోచులు కిష్టయ్య, ఆనంద కిషోర్, ప్రవీణ్, వీణ, తదితరులు పాల్గొన్నారు.