సీతక్కకు హోంశాఖ!
- దానం నాగేందర్, రాజగోపాల్‌కు మినిస్ట్రీ
- నిజామాబాద్‌కు ఒక మంత్రి పదవి
- మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి దామోదర ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో మంత్రివర్గ మార్పులు, చేర్పులపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజన ర్సింహ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తు న్నాయి. రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తర ణ ఉంటుందని, మంత్రి సీతక్కకు కీలకమైన హోంశాఖను అప్పగిస్తారని ఆయన పేర్కొ న్నారు. సోమవారం దామోదర రాజనర్సిం హ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో మంత్రివర్గ విస్తరణ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పు లు చేర్పులు ఉంటాయని చెప్పారు.
సీతక్క మినిస్ట్రీ మారి ఆమె హోంశాఖను చేపడు తుందని తెలిపారు. కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి, దానం నాగేందర్‌కు మంత్రి పద వులు వస్తాయని జోస్యంచెప్పారు. నిజామా బాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి వస్తుం దని అన్నారు. రాజకీయాలు పరిస్థితిని బట్టి మారుతుంటాయని పేర్కొన్నారు. గతంలో ఇతర పార్టీల నేతలకు టిక్కెట్లు లేవని పార్టీ ముఖ్య నేత రాహుల్‌గాంధీ చెప్పారని.. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా టిక్కెట్ల కేటా యింపు జరిగిందని వెల్లడించారు. వైద్యా రోగ్య శాఖపైనా రాజనర్సింహ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో వైద్యశాఖలో ప్రక్షాళన, సంస్కరణలు ఉంటాయని పేర్కొ న్నారు. వైద్య శాఖలో రెండే విభాగాలు ఉం డాలని, అందులో ఒకటి అడ్మినిస్ట్రేషన్ వింగ్ అయితే మరోటి ఎడ్యుకేషన్ వింగ్ అని అన్నారు.






