గాఢ నిద్రలో సజీవ సమాధి
- మట్టి మిద్దె కూలి తల్లితో సహా ముగ్గురు పిల్లలు మృతి
- తండ్రి పరిస్థితి విషమం
- నాగర్‌కర్నూల్‌లో ఘటన
- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
- రూ.4లక్షల పరిహారం ఇస్తామని వెల్లడి
నాగర్‌కర్నూల్, జూలై 1 (విజయక్రాంతి): గాఢ నిద్రలోనే ఉండగానే ఓ కుటుంబంలో ని నలుగురు సజీవ సమాధయ్యారు. రోజూలాగే ఇంట్రో నిద్రించిన వారు ఆ రాత్రి కాలరాత్రిగా మారి చివరి నిద్ర అవుతుందని గ్రహించలేకపోయారు. కూడు, గూడు, గుడ్డ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాల తీరుతో ఇలాంటి కుటుంబాల్లో బతుకులు తెల్లారుతున్నాయి. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబం లో తల్లితో సహా ముగ్గురు పిల్లలు సజీవసమాధి అయిన విషాదకర ఘటన నాగర్‌క ర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్, పద్మ(28) భార్యభర్తలు.
వారికి కూతుళ్లు తేజస్విని(7), వసంత(6), కుమారుడు రిత్విక్(1) ఉన్నారు. భాస్కర్ ప్యాసింజర్ ఆటో నడుపు తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఐదుగురు నిద్రలోకి జారుకున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసిన వారి ఇంటి మట్టి మిద్దె సోమవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి ఐదుగురినీ కప్పేసింది. చుట్టుపక్కల వారు ఆ శబ్దాన్ని గమ నించి లేచి చూసే సరికి మట్టిదిబ్బల కింద చిక్కుకుని ఉన్నారు. ఫ్రిజ్ కింద చిక్కుకున్న భాస్కర్‌ను బయటికి లాగి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పద్మ, తేజస్విని, వసంత, రిత్విక్ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. వారి మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడి కి చేరుకుని వివరాలను సేకరించారు. ఎమ్మె ల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి రూ.4లక్షల పరిహారం అందేలా చూస్తామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
2020లో ఒకే ఇంట్లో ముగ్గురి మృతి
నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో 2020 అక్టోబరు 14న మట్టిమిద్దె కూలి ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందిన ఘటన ఆ గ్రామాన్ని కలిచివేసింది. గ్రామానికి చెందిన కొండ హన్మంత్‌రెడ్డి (70), తన భార్య అనసూయ(55), మనవడు హర్షవర్ధన్‌రెడ్డి(12) ఇంట్లో నిద్రి స్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
సంవత్సరికం కోసం వచ్చి..
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామంలో 2020 అక్టోబరు 25న తండ్రి సంవత్సరికం కోసం హైదరాబాద్‌లో బతుకీడుస్తున్న కొడుకులు, కోడళ్లు గ్రామానికి వచ్చారు. మరుసటి రోజు దసరా సంబరాల్లో మునగాల్సిన ఆ కుటుంబం మట్టిమిద్దె కూలి ఐదుగురు సజీవసమాధి అయ్యా రు. ఆ సంఘటనలో మణెమ్మ(65), సుప్రజ(40), ఉమాదేవి(35), వైష్ణవి(14), అక్షయ(12) మృతిచెందారు.
వెయ్యికిపైగా మట్టిమిద్దెలే
నాగర్‌కకర్నూల్ జిల్లాలో 461 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. నేటికీ ఆర్థికంగా లేక తాతల నాటి మట్టిమిద్దెల్లోనే నివాసముంటున్న కుటుంబాల సంఖ్య వెయ్యికిపైగానే ఉంది. ఏళ్లనాటివి కావడంతో చిన్నపాటి వర్షానికే తడిసి ముద్దయి కూలుతున్నాయి. వారికి అవగాహన కల్పించాల్సిన అధికారులు, పాలకులు నిర్లక్ష్యం విహిస్తున్నారు. కనీసం వానాకాలంలోనైనా మట్టిమిద్దె ఇళ్లలో ఉండే కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలోనూ విఫలం అవుతున్నారు. గత్యంతరం లేని కుటుంబాలు ఆ ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు.






