16 April, 2026 | 9:49 AM

పెరగనున్న హోండా కార్ల ధరలు

21-12-2024 12:30 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఇతర కార్ల కంపెనీల బాటలోనే హోండా కార్స్ ఇండియా కూడా ధరల పెంపును ప్రకటించింది. ముడి వ్యయాలు పెరిగినందున, వచ్చే జనవరి నుంచి తమ కార్ల ధరల్ని మోడల్‌ను బట్టి  2 శాతం వరకూ పెంచనున్నట్లు శుక్రవారం కంపెనీ తెలిపింది. దేశీయ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా అమేజ్, సిటీ, ఎలివేట్ మోడల్స్‌ను విక్రయిస్తున్నది. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీలు వాటి కార్ల ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే.