22 August, 2026 | 12:42 PM

విద్యార్థులే టార్గెట్‌.. జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్ల కలకలం

22-08-2026 12:11 PM

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్లు

మహదేవ్ పురంలో ఎస్ఓటీ పోలీసుల దాడి

మహారాష్ట్ర నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా

జగద్గిరిగుట్ట: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో(Jagadgirigutta) గంజాయి చాక్లెట్ల కలకలం రేగింది. చాక్లెట్ రూపంలో గంజాయి అమ్ముతున్న మహిళ గుట్టురట్టు అయింది. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు జ్యోతి నుంచి 23 కిలోల గంజాయి చాక్లెట్లను(Ganja Chocolates) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో మహదేవ్ పురంలో ఎస్ వోటీ పోలీసులు దాడి చేశారు. మహారాష్ట్ర నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ్యోతితో పాటు మరో ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మత్తుపదార్థాలపై కఠిన ఆంక్షలు విధించింది.