పూజారులు, మౌజన్ల గౌరవ వేతనం 500 పెంపు
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మమత వరాలు
కోల్‌కతా, మార్చి ౧౫: పూజారులు, మౌజన్ల గౌరవ వేతనాన్ని రూ.500 చొప్పు న పెంచుతున్నట్లు ఆదివారం సాయంత్రం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తాజాగా నిర్ణయంతో వారి గౌరవ వేతనం రూ.౨ వేలకు చేరుతుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు, కొద్ది నిమిషాల ముందు సీఎం ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, స్థానిక సంస్థల ఉద్యోగులకూ డీఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే సీఎం ఈ ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, సీఎం వరాలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే సీఎం ఇలాంటి ప్రకటనలు చేశారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కొట్టిపారేశారు. ఇవన్నీ ఎన్నికల డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని సీఎం గుర్తుపెట్టుకోవాలని సీఎంకు హితవు పలికారు.




