16 March, 2026 | 5:07 AM

ఇరాన్ స్పేస్ సెంటర్ ధ్వంసం

16-03-2026 12:53 AM
  1. పశ్చిమ టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడి
  2. 20 నిమిషాల్లో 20 పేలుళ్లు!
  3. ఇస్ఫహాన్‌లోని అణుకేంద్రంపై క్షిపణులు, ఫ్లుట్లై ఎటాక్
  4. 15 మంది మృతి?

టెహ్రాన్, మార్చి 15: పశ్చిమ ఆసియా దేశాల్లో అమెరికా ఇరాన్ మ ధ్య యుద్ధం రోజురోజుకూ విజృంభిస్తోంది. ఆయా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఆదివారం 15వ రోజుకు చేరాయి. పశ్చిమ టెహ్రాన్‌లోని ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్‌పై, ఇస్ఫహాన్ నగరంలోని అణుకేంద్రంపై అమెరికా దళాలు దాడులు చేసి, విధ్వంసం సృష్టించాయి. బీ52 బాంబర్‌తో బాంబుల వర్షం కురిపించాయి. ఇస్పహాసన్‌లో ఆదివారం జరిగిన దాడుల్లో మొత్తం 15 మంది మృతి చెందారు. ఇరాన్ తనకు అవసరమైన శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారాన్ని ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచే సేకరిస్తుంది.

ఇరాన్‌పై దాడులకు అమెరికా తన వద్ద ఉన్న బీ52 బాంబర్ విమానాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఇది దాదాపు 38 టన్నుల బాంబులను తీసుకెళ్లగలదు. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ కమాం డ్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం ఉదయం దాదా పు 20 నిమిషాల్లోనే 20 భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు.

నగరం లోని ఎయిర్‌పోర్టు వద్ద ఇవి సంభవించినట్లు చెబుతున్నారు. ఇరాన్‌కు కీలకమైన అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా భీకర దాడులు చేసింది.  చాలాచోట్ల భారీఎత్తున నల్లనిపొగ ఆకాశాన్ని కమ్మేసింది. యూఎస్ యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేశాయి. ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.