17-02-2026 03:02:27 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మైలారపు లింబాద్రిని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానం చేశారు. మైలారపు లింబాద్రితో పాటు వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, 23వ వార్డు కౌన్సిలర్ గా కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ ను సంఘ భవనంలో అధ్యక్షులు కొండ మురళి,సభ్యులు శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ... మీ అందరి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా నియమితుల కావడం సంతోషకరం.
మీకు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు ఎప్పుడైనా రావచ్చని మీకు ఎల్లప్పుడు సహాయ సహకారం అందిస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ అధ్యక్షులు కొండ మురళి, కార్యదర్శి ఇంద్రాల ఈశ్వర్, కోశాధికారి మద్దేనపల్లి స్వామి, ఉపాధ్యక్షులు ఎదులాపురం కుమార్, గౌరవ అధ్యక్షులు కొడిమ్యాల వెంకటస్వామి,మ్యాడపు అశోక్, గడిపల్లి నారాయణ, భూమేశ్వర్, చంద్రగిరి, రామకృష్ణ, మ్యాడపు శ్రీనివాస్,రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.